Nizamabad MP

8న టిఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ ప్రారంభోత్సవం

తెలంగాణ రాష్ట్ర సమితి ప్ర‌పంచ‌మంతటికీ విస్త‌రిస్తోంది. ప్ర‌వాస తెలంగాణీయులు ప్ర‌పంచంలో న‌లుమూల‌లా ఉన్నారు. ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్ రావు గ‌త ప్లీన‌రీల‌లో టిఆర్ఎస్ విదేశాల‌కు విస్త‌రించాల‌ని త‌న మ‌న‌సులో మాట చెప్తుండే వారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే వివిధ దేశాల్లో టిఆర్ఎస్ శాఖ‌లు ఏర్ప‌డ్డాయి. ఈ నెల 8వ తేదీన ఆస్ర్టేలియా టిఆర్ఎస్ శాఖ ఏర్ప‌డుతున్న‌ది. ఆ రోజు ఆస్ట్రేలియా దేశంలోని సిడ్నీలో జ‌రిగే  బ‌తుక‌మ్మ ఉత్స‌వాల్లో తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత  హాజ‌ర‌వుతున్నారు.

trs-australia

తెలంగాణ జాగృతి ఆస్ట్రేలియా శాఖ ఆధ్వ‌ర్యంలో జ‌రిగే బ‌తుక‌మ్మ సంబురాల‌కు ఆ దేశం న‌లుమూల‌ల నుండి తెలంగాణ బిడ్డ‌లు హాజ‌ర‌వుతున్నారు. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని క‌ల్వ‌కుంట్ల క‌విత టిఆర్ ఎస్ ఆస్ట్రేలియా శాఖ‌ను లాంచ‌నంగా ప్రారంభిస్తారరి టిఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్య‌క్షుడు నాగేంద‌ర్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్  ఆలోచ‌న మేర‌కే టిఆర్ ఎస్ ఎన్నారై శాఖ‌లు ఏర్పాట‌వుతున్నాయ‌ని తెలిపారు. ప‌లు సామాజిక  సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్న తాము తెలంగాణ  అడపడుచు క‌ల్వ‌కుంట్ల‌ కవిత చేతులమీదుగా ఆస్ట్రేలియా శాఖ ప్రారంభం అవుతుండ‌డం తెలంగాణ ఎన్నారైల‌కు సంతో్ష‌క‌ర‌మైన విష‌య‌మ‌న్నారు నాగేంద‌ర్ .


Connect with us

Latest Updates