Nizamabad MP

రూ.141 కోట్లు విడుద‌ల చేయండి

రైల్వే మంత్రి సురేశ్ ప్ర‌భును క‌లిసిన ఎంపి క‌విత‌
రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్ర‌భును నిజామాబాద్ ఎం.పి శ్రీమ‌తి క ల్వ‌కుంట్ల క‌విత గారు క‌లిశారు. పెద్ద‌ప‌ల్లి-నిజామాబాద్ రైల్వే లైను కోసం మంజూరు చేసిన రూ.141 కోట్లను విడుద‌ల చేయాల‌ని ఆమె కోరారు.ఈ మేర‌కు ఆమె విజ్ఞాప‌న ప‌త్రం అంద‌జేశారు. ఈ ఆర్థిక సంవ‌త్స‌రం ముగుస్తున్న నేప‌థ్యంలో ఇన్‌స్టాల్ మెంట్ కింద ఇవ్వాల్సిన నిధులను విడుద‌ల చేయాల‌న్నారు. 1993-94 ఆర్థిక సంవ‌త్స‌రంలో ప్రారంభ‌మైన పెద్ద‌ప‌ల్లి-నిజామాబాద్ రైల్వే లైను ప‌నులు త్వరితంగా పూర్త‌య్యేలా చూడాల‌ని కోరారు. ఈ లైన్ పూర్త‌యితే, నిజామాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, ఆదిలాబాద్‌, వ‌రంగల్ జిల్లావాసుల‌తో పాటు పొరుగు రాష్ట్రాల‌యిన మ‌హారాష్ట్ర‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు ప్ర‌యాణ భారం త‌గ్గుతుంద‌న్నారు. అలాగే ప‌సుపు త‌యారీదారులు, వ్యాపారుల‌కూ ఉప‌యుక్తంగా ఉంటుంద‌ని తెలిపారు. పెద్ద‌ప‌ల్లి-నిజామాబాద్ రైల్వే లైన్ పూర్త‌యితే, సాధార‌ణ ప్ర‌యాణీకుల‌కు సౌకర్యంగా ఉండ‌ట‌మే కాక‌ త‌యారీదారులు, వ్యాపారుల‌కు దేశీయంగా మార్కెట్ సౌక‌ర్యాలు అందుబాటులోకి వ‌స్తాయ‌ని ఎంపి. క‌విత గారు రైల్వే మంత్రికి వివ‌రించారు. మ‌హిళా ఉద్యోగుల‌కు ఇన్‌కం టాక్స్ ప‌రిమితిని రూ. 6 ల‌క్ష‌ల‌కు పెంచండి


Connect with us

Latest Updates