పార్లమెంటులో మహిళా బిల్లు ఆమోదం పొందినప్పుడే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కు నిజమైన నివాళి అర్పించినట్టన్నారు నిజాబాబాద్ ఎంపి శ్రీమతి కవిత. అంబేడ్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ టాంక్ బండ్ వద్దనున్న అంబేడ్కర్ విగ్రహానికి ఆమె పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఫోటో ప్రదర్శనను తిలకించారు. మీడియాతో మాట్లాడుతూ…చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమన్న అంబేడ్కర్ ఆలోచనను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామన్నారు. మహిళా బిల్లును కూడా పార్లమెంటులో ఆమోదింప చేసుకో్వాల్లి ఉందన్నారు. అసెంబ్లీ ఆవరణలో అంబేడ్కర్ విగ్రహాం ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వంపై వత్తిడి తెచ్చామన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి కేసిఆర్ గారు 125 అడుగుల ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేయడం నిజంగా అందరకీ సంతోషకరమైన విషయమన్నారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా తెలంగాణ జాగృతి ఏడాది పొడుగునా కార్యక్రమాలను నిర్వహిస్తుందని కవిత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి,ఖైరతాబాద్ కార్పోరేటర్ పి. విజయారెడ్డి, తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షుడు రాజీవ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.
Connect with us
Latest Updates
కేసిఆర్ కిట్స్ పంపిణీ చేసిన ఎంపి కవిత
July 8, 2017
Latest Updates
prev next